జయ కాస్త స్ట్రిక్ట్..ఆమె అంటే నాకు భయమే: అమితాబ్ బచ్చన్

  • తాజా కేబీసీ షోలో ఆసక్తికర సన్నివేశం
  • జయాబచ్చన్ స్ట్రిక్ట్ మనిషా అంటూ అమితాబ్‌కు కంటెస్టెంట్ ప్రశ్న
  • తనతో ఆమె స్ట్రిక్ట్‌గానే ఉంటుందన్న బిగ్ బీ
  • భార్య అంటే తనకు కాస్త భయమంటూ సరదా వ్యాఖ్య
దశాబ్దానికి పైగా కొనసాగుతున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతీ’ షో.. బిగ్ బీ అభిమానులకు ఎన్నో తీపి గుర్తులు మిగిల్చింది. షో వ్యాఖ్యాతగా అమితాబ్ అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలనూ అభిమానులతో షేర్ చేసుకుంటారు. తాజా షోలో ఆయన తనకు భార్య జయా బచ్చన్ అంటే భయమని సరదాగా వ్యాఖ్యానించారు. అమె తన విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా సీజన్ 40 ఎపిసోడ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 

కంటెస్టెంట్‌తో బిగ్‌బీ మాట్లాడుతుండగా ఆమె తానో టీచర్ అని చెప్పుకొచ్చింది. తను టీచర్‌గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటానని, ఇతర సమయాల్లో మాత్రం సరదాగా ఉంటానని చెప్పుకొచ్చింది. అనంతరం జయా బచ్చన్ నిజ జీవితంలో మీతో ఎలా ఉంటారని బిగ్ బీని ప్రశ్నించింది. దీంతో క్షణకాలం పాటు మౌనంగా ఉండిపోయిన బిగ్ ఆ తరువాత.. ‘‘ఆమె స్ట్రిక్ట్‌గానే కాకుండా సరదాగా ఉంటుందని సమాధానమిచ్చారు. ‘‘హమ్మయ్య.. నేను పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నా’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. 

ఆ తరువాత మెల్లగా అసలు విషయం బయటపెట్టారు. ‘‘ఆమె నాతో స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. అయినా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు. ఆమెతో కలసి ఈ షో చూసేటప్పుడు నాకు దబిడిదిబిడే. ఆ సీన్ తలుచుకుంటేనే నాకు భయం. అందుకే వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా బయటకు చెప్పను’’ అంటూ అమితాబ్ సరదాగా కామెంట్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నేత జయా బచ్చన్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 

Amitabh Bachchan
Jaya Bachchan
Kaun Banega Crorepati

More Telugu News